“Cyclone Amphan” Storm Hit Coasts Of Odisha & West Bengal,Vizagvision….పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అతి తీవ్ర తుపాన్ ఉమ్ పున్ కొనసాగుతోంది. ప్రస్తుతం పారాదీప్‌కు దక్షిణంగా 780 కిలోమీటర్ల దూరంలో ఉమ్ పున్ కేంద్రీకృతమైంది. బెంగాల్‌లోని దిఘాకు 930 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఉత్తర ఈశాన్య దిశగా 8 కిలోమీటర్ల వేగంతో ఉమ్ పున్ కదులుతోంది. ఈ క్రమంలో ఉమ్ పున్ మరింత బలపడి పెను తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నెల 20వ తేదీన సాయంత్రం తుపాను తీరం దాటే అవకాశం ఉంది. బెంగాల్ – బంగ్లాదేశ్ మధ్య హతియా దీవుల వద్ద తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటే వేళ గాలుల వేగం గంటకు 185 కిలోమీటర్ల వరకు ఉంటుందని అంచనా వేసింది వాతావరణ శాఖ. తుపాను ప్రభావంతో ఒడిశా, బెంగాల్, సిక్కింలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాంధ్రలో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.