YS Jagan Mohan Reddy Video Conference with LG Polymer Gas Leak Victims,Vizagvision…
ఎల్జి పాలిమర్స్ గ్యాస్ లీకేజీ దుర్ఘటన ఎంతో బాధాకర విషయం అని ఇటువంటి సంఘటనలు ఎక్కడా జరగకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్యాస్ లీకేజీ దుర్ఘటన బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి పదివేలు చొప్పున నగదును ఆన్లైన్ విధానం ద్వారా బ్యాంకు ఖాతాలో జమ చేశారు. ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవడం బాధాకర విషయం అంటూ విచారం వ్యక్తపరిచారు. ఎల్జి పాలిమర్స్ కంపెనీని విశాఖ నుంచి తరలించనున్నట్లు సీఎం తెలిపారు. ప్రజలు ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరూ ధైర్యంగా ఉండాలని , ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని మీ కుటుంబంలో మీ బిడ్డగా ఉంటానని భరోసా ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మన ప్రభుత్వం స్పందించి కోటి రూపాయల పరిహారాన్ని బాధితులకు అందించడం జరిగిందన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రత్యేక పరిశీలన కమిటీలను నియమించడం జరిగిందన్నారు . వారు అందించిన నివేదిక ప్రకారం ఈ దుర్ఘటనకు బాధ్యులైన ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా యంత్రాంగం స్పందించి తక్షణ చర్యలు చేపట్టి ప్రభావిత గ్రామ ప్రజలను దూర ప్రాంతాలకు తరలించి షెల్టర్లు లో ఉంచి వారి కి ఎంతో ధైర్యాన్ని అందించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా నన్నారు.
జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ముఖ్యమంత్రితో మాట్లాడుతూ ఎల్జి పాలిమర్స్ లో ఉన్నటు వంటి మిగిలిన స్టేరైన్ నిల్వలను పూర్తిగా రెండు షిప్ లలో పంపడం జరిగిందన్నారు. గ్యాస్ లీకేజ్ ప్రభావిత గ్రామాల లో నిరంతర శానిటేషన్ ప్రక్రియ కొనసాగుతున్న దన్నారు. నెల రోజుల పాటు ప్రత్యేక మెడికల్ క్యాంపులను నిర్వహిస్తూ , అంబులెన్సులను అందుబాటులో ఉంచి బాధితుల ఆరోగ్య పరిస్థితులను వైద్య నిపుణుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తున్నారన్నారు. అదేవిధంగా ఆంధ్ర మెడికల్ కాలేజ్ కి చెందిన పదిమంది వైద్య నిపుణులతో కూడిన నోడల్ ఏజెన్సీ కమిటీ హెల్త్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయడం జరిగిందని 12 నెలల పాటు ఇక్కడ ప్రజల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారన్నారు. ఈ గ్రామాలలో వైయస్సార్ క్లినిక్ ను త్వరలో ప్రారంభిస్తామని, అప్పటి వరకు అవసరమైన బెడ్స్, మెడికల్ ఎక్విప్మెంట్ తో తాత్కాలికంగా క్లినిక్ ను ఏర్పాటు చేయనున్నామన్నారు.
గ్రామాల్లో నివసిస్తున్న కుటుంబాల సర్వే పూర్తయిందన్నారు. ఆయా గ్రామాలలో 6,134 కుటుంబాలకు సంభందించి19,893 మంది పెద్దలు మరియూ పిల్లల వ్యక్తి గత బ్యాంక్ అకౌంట్ లను సేకరించడం జరిగిందన్నారు.12 కుటుంబాల కు సంబంధించి ఇళ్లకు తాళాలు వేసి ఉన్నందున తర్వాత వారికి కూడా పరిహారం అందించే ఏర్పాట్లు చేస్తామన్నారు.
వెంకటాపురం గ్రామం వెంకటాద్రి గార్డెన్స్ కు చెందిన మేకా సుశీల ముఖ్యమంత్రి తో మాట్లాడుతూ గ్యాస్ లీకేజ్ దుర్ఘటన లో తన భర్త ప్రాణాలు కోల్పోయి ఒంటరి దాన్ని అయిపోయాననీ, మీరు వెంటనే ఇక్కడకి వచ్చి మా కుటుంబాలను పరామర్శించి మా కన్న బిడ్డలా ఆదుకొని కోటి రూపాయల పరిహారాన్ని అందించారని అందుకు కృతజ్ఞతలను తెలు పుకొంటున్నానని అన్నారు. తన మనవడు ఎం టెక్ చదువు కున్నాడని, ప్రస్తుతం ఒంటరిగా ఉన్న తనకు తోడుగా ఉంటున్నాడని అతనికి ఉద్యోగ ఉపాధి కల్పించాల్సిందిగా కోరగా, వెంటనే సీ ఏం స్పందిస్తూ ఉపాధి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా గ్యాస్ దుర్ఘటన లో ప్రాణాలు కోల్పోయిన 12 మంది కుటుంబాల వివరాల ప్రతిపాదనలను పంపాల్సిందిగా జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ఆ కుటుంబాల కు ఉపాధి అవకాశాలు కల్పించడానికి చర్యలు చేపడతామని సీ ఎం స్పష్టం చేశారు.
ఎస్ సి, బీ సీ కాలనీ కి చెందిన పొట్నూరి పరమేశ్వరి మాట్లాడుతూ తెల్లవారు జామున అందరం నిద్రలో ఉంటే గ్యాస్ లీకేజీ అవుతున్నదని వెంటనే అందరూ బయటకు వచ్చేయండి అనీ అధికారులు, పోలీస్ లు వచ్చి మమ్మల్ని అంబులెన్స్ లో ఎక్కించుకొని దూరంగా ఉన్న కాలేజ్ లోకి తీసుకెళ్లి మా ప్రాణాలను కాపాడారాన్నారు.అక్కడ చాలా మందికి వాంతులు అవుతుంటే కేజీ హెచ్ కి తీసుకెళ్లారన్నారు. మీరు కూడా ఆస్పత్రికి వచ్చి అందర్నీ పరామర్శించి చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు, వెంటిలేటర్ లో ఉన్నవారికి పది లక్షలు, రెండు రోజులు పై బడి ఉన్నవారికి లక్ష రూపాయలు, చికిత్స పొందిన వారికి 25 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేసి ప్రతీ ఒక్కరికీ నేనున్నాను అన్న భరోసా ఇచ్చారన్నారు.
కాలేజ్ లో నాలుగు రోజుల వరకు మా కుటుంబాల అందరికీ మంచి భోజనం పెట్టి, డాక్టర్లు తో పరీక్షలు చేయించారనన్నారు. తెల్లవారే మా మంత్రి అవంతి శ్రీనివాసరావు గారు, ఎం ఎల్ ఏ గారు, ఎం పీ గారు, కలెక్టర్ గారు,కమిషనర్ గారు, ఇంకా చాలా మంది అధికారులు వచ్చి భయం లేదు అని భరోసా ఇచ్చారన్నారు. ఇంటింటికీ ఫినాయిల్, శానిటైజర్ , మాస్కులు ఇచ్చి మా ఇళ్లకు పెద్ద యంత్రాలతో స్ప్రే చేశారన్నారు. మా గ్రా
మంలో మంత్రి కృష్ణ దాస్ గారు రాత్రి పడుకొని ఉదయాన్నే ఇంటింటికి వచ్చి మా కుటుంబాలకు అండగా ఉన్నామన్న ధైర్యాన్ని ఇచ్చారన్నారు. మా కుటుంబ సభ్యులం నలుగురు అని ఒక్కొక్కరికీ పదివేల చొప్పున నలబై వేలు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానన్నారు. గతంలో అమ్మఒడి డబ్బులు అందాయనీ, తన భర్త ఆటో డ్రైవర్ అనీ అతనికి పది వేలు ఆర్థిక సాయం ఇచ్చారని, మా కుటుంబం మీకు రుణ పడి ఉంటుందన్నారు.
పద్మనాభపురం గ్రామానికి చెందిన గంగరాజు మాట్లాడుతూ గ్యాస్ లీకేజ్ ప్రమాదం జరిగిన నాటి నుండి రాష్ట్ర మంత్రులు , స్థానిక నాయకులు , జిల్లా కలెక్టరు, కమిషనర్, అధికారులు ప్రతిరోజు ఇంటింటికీ తిరిగి మా ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నా రన్నారు. మెడికల్ క్యాంపులను పెట్టి వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నారన్నారు. ఈ సంఘటన జరిగిన వెంటనే తమరు చనిపోయిన వారికి కోటి రూపాయలను అందించి వారి కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకున్నారన్నారు.మీకు మా ప్రత్యేక ధన్యవాదాలను తెలియ జీసుకుంటున్నా నన్నారు.

















