ఢిల్లీ నుంచి విశాఖ చేరుకున్న ఏపీ విద్యార్థులు, పీఓటీపీఎల్ ట్రైనీలు in Visakhapatnam,Vizagvision….చైనాలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు భారత్ కు చేరుకున్నారు.కరోనా వైరస్ ను కట్టడి చేసేలా అధికారులు తీసుకున్న చర్యలు కారణంగా విశాఖకు చెందిన విద్యార్థులు చైనాలో చిక్కుకున్నారు.దింతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్న సమయంలో ప్రభుత్వ చొరవతో విద్యార్థులు దేశానికి చేరుకున్నారు.ఎల్ ఈ డి మేకింగ్ ట్రైన్ కోసం చైనా వెళ్లిన ట్రైనీలు .. డిల్లీ నుంచి విశాఖ చేరుకున్నారు. చైనా వూహాన్ సిటీకి శిక్షణ కోసం వెళ్ళి చిక్కుకున్న తెలుగు విద్యార్థు లు జనవరి 23 నుంచి చైనాలో చిక్కుకున్నారు.ప్రభుత్వం విద్యార్థుల విషయంలో తగిన చర్యలు తీసుకోవడంతో భారత దేశానికి వచ్చారు.డిల్లీలో 14 రోజులు ఐసోలేషన్ లో ఉంచిన అధికారులు.. వైద్యపరీక్షలు పూర్తి చేసిన కరోనా వైరస్ లేదని వైద్యులు దృవీకరించారు.దింతో వీరిని విశాఖకు చేరుకున్నారు.















