విజయవాడలో అమరావతి పరిరక్షణ సమితి సమావేశమైంది. వేదిక కల్యాణ మండపం వద్ద జరుగుతున్న ఈ సమావేశానికి తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలకు నిరసనగానే పాదయాత్ర చేపట్టనున్నట్లు ఐకాస కన్వీనర్ శివారెడ్డి తెలిపారు. ప్రజలకు నిరసన తెలిపేందుకు కూడా అవకాశమివ్వకపోవడం దారుణమన్నారు. ఈ సమావేశం అనంతరం ఐకాస నేతలు ర్యాలీగా మచిలీపట్నం బయలుదేరనున్నారు. ఈ నేపథ్యంలో వేదిక కల్యాణ మండపం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. జె ఏ సి ఆహ్వానం మేరకు హాజరయ్యాము.
జె ఏ సి ఆహ్వానం మేరకు హాజరయ్యాము..
బస్ ల ను అడ్డుకోవడం పై ప్రశ్నించా..
సెక్యురిటి సమస్య పేరుతో బస్ ల అనుమతి నిరాకరించమని చెప్పారు..
నేను సి ఎం గా వున్నప్పుడు వై ఎస్ ,ఆర్, జగన్ లు పాదయాత్ర చేశారు..
నేను అడ్డుకోలేదు కధా..
మామూలు గా కాదు ముద్దులు పెట్టుతూ తిరిగారు..
జగన్ అంత పిరికివాడు లేరు.
ఎట్టి పరిస్థితి లో యాత్ర ఆపేదీ లేదు. మచిలీపట్నం యాత్ర జరిపి తీరుతాం
మీ అహంభావం ఏమిటి..జె ఏ సి లు పెట్టుకో కూడదా
ప్రజాస్వామ్యం, లా అండ్ ఆర్డర్ పేరుతో అణచివేయలని చూస్తే రెచ్చిపోతాము
లాయర్ల జె ఏ సి ఆక్టివ్ అవ్వాలని పిలుపు
11 మంది రైతులు ప్రాణాలు పోయాయి
అడ్డుపడితే ఉదృతం ఎక్కువ అవుతుంది
తమాషాలు వద్దు ఆలోచించండి
పరిపాలన ఇక్కడ కొనసాగించడానికి ఏమికావాలి… అన్నీ ఉన్నాయి
ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగివుంటే హై కోర్ట్ జడ్జి చే విచారణ చేయించి చర్యలు తీసుకోండి
అమరావతి ఇక్కడే ఉంటుంది అనే ప్రకటన వచ్చే వరకు కొనసాగించాలని పిలుపు
















