ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే ఇవాళ సియాచిన్‌లో పర్యటించారు. అక్కడ ఆయన సైనికులతో ముచ్చటించారు. వారికి న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పారు.
బాధ్యతలు చేపట్టిన వెంటనే ఇక్కడకు రావాలనుకున్నాను, కానీ వాతావరణం సరిగా లేని కారణంగా జనవరి మొదటి వారం పర్యటనను వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు.
అయినా సియాచిన్‌కు ఆర్మీ చీఫ్‌గా మొదటిసారి రావడం సంతోషంగా ఉందన్నారు.
సియాచిన్‌లో విధులు నిర్వర్తించడం అంటే చాలా క్లిష్టమైన అంశమని, ఇక్కడ అన్నీ ప్రతికూల పరిస్థితులే ఉంటాయన్నారు.
దుస్తులు, రేషన్‌తో పాటు అన్ని సదుపాయాలు కల్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆర్మీ చీఫ్ తెలిపారు.
















