Weather 48 hours Heavy Rains Depression in Bay of Bengal in Visakhapatnam,Vizagvision…
పశ్చిమ మధ్య బంగాళాఖాతం కి ఆనుకొని ఏర్పడిన అల్పపీడనం
రానున్న రెండు రోజులపాటు ఏపీలో విస్తారంగా వర్షాలు
ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు
రాయలసీమ తెలంగాణలో కూడా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం
బంగాళాఖాతంలో రానున్న 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.
దీని వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇప్పటికే తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం కొనసాగుతోంది.
దీనికి అనుబంధంగా ఉపరితల అవర్తనం కూడా కొనసాగుతోంది.
4.5 కిలో మీటర్లు ఎత్తు వరకు ఆవర్తనం కొనసాగుతోంది.
తూర్పు మధ్య అరేబియా సముద్రం నుంచి దక్షిణ ఛత్తీస్గఢ్ వరకు ఉత్తర ఇంటిరియర్ కర్నాటక, తెలంగాణ మీదుగా 2.1 కిలో మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది.
దీంతో రాగల 48 గంటల్లో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా, ఆంధ్రా తీరాలకు దగ్గరలో నైరుతి బంగాళాఖాతం.. దానిని అనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతోందని అధికారులు పేర్కొన్నారు.
కోస్తా ఆంధ్రా, యానం, తదితర ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసేఅవకాశం వుందని వాతావరణ శాఖ చెబుతోంది.
కాగా నేడు, రేపు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.