భూ కబ్జాదారులు పై తగిన చర్యలు తీసుకోవాలి
పరదేశి పాలెం,Vizagvision…భూ కబ్జాదారులు పై తగిన చర్యలు తీసుకోవాలి
పరదేశి పాలెం గ్రామంలో గత మూడు నెలల నుంచి బొర అప్పారావు, బోర గీత రెడ్డి, నరహరి అనే వ్యక్తులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని బాధితులు బోర ప్రసాద్, బోర గోవిందు, బోర సూరమ్మ తదితరులు ఆరోపణలు చేశారు. వీరిపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలంటూ వారు కోరారు. వి జె ఎఫ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బోర ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ బొర అప్పారావు, బోర గీత రెడ్డి ల కుటుంబం సుమారు 50 సంవత్సరాల క్రితమే వారి ఆస్తులను వారి దగ్గర బంధువులకు అమ్మి వేసి గ్రామం వదిలి వెళ్ళిపోయారనీ, ఇప్పుడు మరలా గ్రామానికి తిరిగి వచ్చి ఇదివరలో ఉన్న తమ రికార్డుల ప్రకారం గా తప్పుడు పత్రాలు సృష్టించి గత 50 సంవత్సరాల నుంచి అనుభవదారు లైన రైతుల భూములను కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. ఇతరుల భూములు ఆక్రమించి వాటిలో గోడలు కట్టడం, ఇల్లు కట్టడం చేస్తున్నారని బాధితులు తెలిపారు. బోర గీతారెడ్డి మీద పీఎం పాలెం పోలీస్ స్టేషన్లో అనేక కేసులు నమోదు కాబడి ఉన్నాయన్నారు. గ్రామస్తులందరూ గీతారెడ్డి చేస్తున్న దురాగతాల పై అధికారులందరికీ అనేకసార్లు విన్నవించడం కూడా జరిగిందని, కానీ ఇంతవరకు తగు న్యాయం జరగలేదని వారు వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి భూ కబ్జాదారుల పై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ సమావేశంలో బాకీ దుర్గ, బోర గురమ్మ, బోయి పోలిపల్లి, బోర రామయమ్మ తదితరులు పాల్గొన్నారు.