Tourism Container Restaurant Opened at Red Sand Dunes in Bheemili,Vizagvision…. విశాఖ భీమిలి బీచ్ కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకువస్తామని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు.ఎర్రమట్టి దిబ్బలు వద్ద టూరిజం శాఖ 200 కోట్లతో నిర్మించిన కంటైనర్ రెస్టారెంట్ ను ఆయన ప్రారంభించారు.విశాఖ నుండి భీమిలి వరకు ఉన్న అందమైన బీచ్ ప్రకృతి వరప్రసాదం అని దీనిని ఆకర్షణీయంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. విశాఖ జిల్లాలో అనేక చారిత్రాత్మక, పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయని, వాటిని తీర్చిదిద్దినట్లు అయితే అంతర్జాతీయ పర్యాటకులతో పాటు స్వదేశీ పర్యాటకులు కూడా ఎక్కువమంది ఆకర్షితులవుతారు అన్నారు. పద్మనాభం మండలం పాండ్రంగి గ్రామం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పుట్టిన స్థలమని అక్కడ ఒక రెస్టారెంట్ ను ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అందమైన గార్డెన్ ను, సుందర సాగర తీరం అందాలను తిలకించేలా ఈ కంటైనర్ రెస్టారెంట్ ఎంతో సౌకర్యవంతంగా ఆహ్లాదంగా ఉంటుందని తెలిపారు.