పోలీస్ అమరవీరుల సంస్మరణ క్యాండిల్ ర్యాలీ కృష్ణా జిల్లా, మచిలీపట్నం,Vizagvision…
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా మచిలీపట్నం, రేవతి సెంటరు నుండి కోనేరు సెంటరు వరకు జిల్లా SP శ్రీ రవీంద్ర నాధ్ బాబు ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.
పోలీస్ అమరవీరుల సంస్మరణ క్యాండీల్ ర్యాలీలో పాల్గొన్న జిల్లా ఎస్పీ రవీంద్ర బాబు, ఏఎస్పీ సత్తిబాబు, డిఎస్పీ మహబూబ్ బాషా, విద్యార్థులు, పురప్రజలు, పోలీస్ అధికారులు, సిబ్బంది…
ర్యాలీ అనంతరం అమరవీరులకు నివాళులర్పిస్తూ 2 నిమిషాలు పాటు మౌనం…
ఎస్.పి రవీంద్రనాథ్ బాబు కామెంట్స్…
?వివిధ విభాగాలలో పనిచేస్తూ విధి నిర్వహణలో ఆసువులు బాసిన పోలీసు అమరవీరుల నివాళులర్పించే ర్యాలీ విజయవంతంగా నిర్వహించాము…
?ఎంతో మంది దేశ భద్రతకు ప్రాణాలు అర్పించిన వారికి నివాళులర్పించటం వారు చేసిన త్యాగాలతో పోలిస్తే మనం చేసేది చాలా చిన్న కార్యక్రమం…
?అయితే దేశ శాంతి భద్రతల రక్షించేందుకు అందరం భాగస్వామ్యం అవ్వాలి..
?రాబోయే రోజుల్లో భారతదేశ ఖ్యాతి హిమాలయాల కంటే ఎత్తులో ఎదగాలి.
?ఎంతో మంది నిస్వార్థ త్యాగాలతోనే మనం అందరం సుఖ సంతోషాలతో ఉన్నాం అన్న విషయం విద్యార్థులు గుర్తుంచుకోవాలి..