సచివాలయంలో కలెక్టర్లు, ఎస్పీలతో జగన్మోహన్ రెడ్డి ‘స్పందన’ కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. Amaravathi,Vizagvision..
కలెక్టర్లు ఎవ్వరు కూడా స్పందన కార్యక్రమాన్ని మిస్ కావొద్దు, వస్తున్న వినతుల పరిష్కారంలో నాణ్యత ఉండాలి, ప్రతి రశీదుమీద కూడా తేదీ ఉండాలని పేర్కొన్నారు..
ఆత్మహత్య చేసుకున్నారని రికార్డులు చెప్తున్నాయి కానీ,391 మందికి మాత్రమే పరిహారం ఇచ్చినట్టుగా రికార్డులు చెప్తున్నాయి,
మీమీ జిల్లాల్లో డేటాను పరిశీలించండి, ఎవరైనా అర్హులున్న రైతు కుటుంబాలు ఉంటే వెంటనే వారికి పరిహారం ఇవ్వండి-వారి కుటుంబాల్లో ఆత్మస్థైర్యాన్ని నింపండి
ఎమ్మెల్యేలతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించండి, కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ఆ కుటుంబం దగ్గరకు వెళ్లాలి
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్షలు పరిహారం ఇవ్వడమే కాదు, వారికిస్తున్న పరిహారాన్ని వేరొకరు తీసుకోలేని విధంగా ఒక చట్టాన్ని కూడా తీసుకు వస్తున్నామని తెలిపారు…