HomeUncategorizedVisakhapatnam Vizag vision: నేటి నుంచి 2వ బిమ్స్టెక్ పోర్ట్స్ కాంక్లేవ్బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ-సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ (బిమ్స్టెక్) పరిధిలో ప్రాంతీయ నౌకాశ్రయ, సముద్ర సంబంధాల బలోపేతానికి బిమ్స్ టెక్ కాంక్లేవ్ ను విశాఖ కేంద్రంగా నేడు రేపు రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.కేంద్ర పోర్టులు నౌకా జలరవనా శాఖా మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఈ కాంక్లేవ్ ను నేడు అధికారికంగా ప్రారంభించనున్నారు.బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, నేపాల్, శ్రీలంక మరియు థాయ్లాండ్ సహా బిమ్స్టెక్ సభ్యదేశాల ప్రతినిధులు ఈ రెండు రోజుల సమ్మేళనానికి హాజరయ్యేందుకు విశాఖ చేరుకున్నారు. దేశంలోని అన్ని ప్రధాన పోర్టుల చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లు మరియు సీనియర్ అధికారులు సదస్సులో పాల్గొంటున్నారు.డా. ఎం. అంగముత్తు, IAS, చైర్మన్, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ నేతృత్వంలో ఏర్పాట్లను పోర్ట్ అధికారులు పూర్తి చేశారు.కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ విశాఖపట్నం పోర్టులో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఆయనతో పాటు, కేంద్ర సహాయ మంత్రి శ్రీ శాంతను ఠాకూర్, చైర్మన్ డా. ఎం. అంగముత్తు, డిప్యూటీ చైర్మన్, మరియు పోర్ట్ అథారిటీకి చెందిన ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొంటారు.బిమ్స్టెక్ దేశాల ప్రముఖులు మరియు హోస్ట్ దేశమైన భారత్కి చెందిన నౌకాశ్రయ రంగ నిపుణులు తమ అనుభవాలను సభ్య దేశాలతో పంచుకోనున్నారు.ఈ కాంక్లేవ్ ద్వారా బిమ్స్టెక్ దేశాల మధ్య పోర్ట్ మరియు మేరిటైమ్ రంగాల్లో భాగస్వామ్యం మరింత బలోపేతం కావడంతో పాటు, విశాఖపట్నం బే ఆఫ్ బెంగాల్ ప్రాంతంలో ఒక కీలక సముద్ర కేంద్రంగా ఎదగనుంది.
Visakhapatnam Vizag vision: నేటి నుంచి 2వ బిమ్స్టెక్ పోర్ట్స్ కాంక్లేవ్బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ-సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ (బిమ్స్టెక్) పరిధిలో ప్రాంతీయ నౌకాశ్రయ, సముద్ర సంబంధాల బలోపేతానికి బిమ్స్ టెక్ కాంక్లేవ్ ను విశాఖ కేంద్రంగా నేడు రేపు రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.కేంద్ర పోర్టులు నౌకా జలరవనా శాఖా మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఈ కాంక్లేవ్ ను నేడు అధికారికంగా ప్రారంభించనున్నారు.బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, నేపాల్, శ్రీలంక మరియు థాయ్లాండ్ సహా బిమ్స్టెక్ సభ్యదేశాల ప్రతినిధులు ఈ రెండు రోజుల సమ్మేళనానికి హాజరయ్యేందుకు విశాఖ చేరుకున్నారు. దేశంలోని అన్ని ప్రధాన పోర్టుల చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లు మరియు సీనియర్ అధికారులు సదస్సులో పాల్గొంటున్నారు.డా. ఎం. అంగముత్తు, IAS, చైర్మన్, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ నేతృత్వంలో ఏర్పాట్లను పోర్ట్ అధికారులు పూర్తి చేశారు.కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ విశాఖపట్నం పోర్టులో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఆయనతో పాటు, కేంద్ర సహాయ మంత్రి శ్రీ శాంతను ఠాకూర్, చైర్మన్ డా. ఎం. అంగముత్తు, డిప్యూటీ చైర్మన్, మరియు పోర్ట్ అథారిటీకి చెందిన ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొంటారు.బిమ్స్టెక్ దేశాల ప్రముఖులు మరియు హోస్ట్ దేశమైన భారత్కి చెందిన నౌకాశ్రయ రంగ నిపుణులు తమ అనుభవాలను సభ్య దేశాలతో పంచుకోనున్నారు.ఈ కాంక్లేవ్ ద్వారా బిమ్స్టెక్ దేశాల మధ్య పోర్ట్ మరియు మేరిటైమ్ రంగాల్లో భాగస్వామ్యం మరింత బలోపేతం కావడంతో పాటు, విశాఖపట్నం బే ఆఫ్ బెంగాల్ ప్రాంతంలో ఒక కీలక సముద్ర కేంద్రంగా ఎదగనుంది.