కాస్త కోలుకున్న దేశీయ మార్కెట్లు,Vizagvision..
ముంబయి : బడ్జెట్ అనంతరం కొన్ని రోజులుగా తీవ్ర ఒడిదొడుకులకు లోనైన దేశీయ మార్కెట్లు బుధవారం కాస్త కోలుకున్నాయి.
ఉదయం 9.40 గంటల నుండి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్ 76 పాయింట్లు లాభపడి 38,807 వద్ద కొనసాగుతోంది.
అదే సమయంలో జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 23 పాయింట్ల లాభాలతో 11,579 వద్ద ట్రేడవుతోంది.
డాలరుతో రూపాయి మారకం విలువ 68.63 వద్ద కొనసాగుతోంది.
రంగాలవారీగా చూస్తే ఐటి మినహా దాదాపు మిగతా రంగాల షేర్లన్నీ లాభాల్లో నమోదవుతున్నాయి.
ఇండస్ ఇండ్ బ్యాంక్, కోల్ ఇండియా, యస్ బ్యాంక్, టాటా స్టీల్, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా..
టీసీఎస్, బజాజ్ ఫినాన్స్, ఎమ్అండ్ఎమ్, జజాజ్ ఆటో, ఇన్ఫోసిస్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

















