Sravana Masam Festivel Atmosphere Prevails for women Markets,Visakhapatnam,Vizag Vision..ల్లె నుంచి పట్టణం దాకా సందడి కావాలంటే శ్రావణం రావల్సిందే.ఆహ్లదకరవాతావరణంతో పాటు,ఆధ్యాత్మక పరిమళం ఈ మాసానికి ఎక్కువే.వరలక్ష్మీ దేవి,శ్రీఘీవుడు,శ్రీకృష్ణుడు,వరహామూర్తి,సంతోషిమాత.వీళ్లంతా ఈ నెలలోనే జన్మించారట.శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవి ఆరాధనకు మంచిదని పెద్దలు అంటారు.ఈ నెలలో సోమవారాలు విశిష్టమైనివే.ఆ రోజులో శివుడికి అభిషేకం చేస్తే ఎంతో మంచిదంటారు.విశాఖ లో కూడా శ్రావణ శుక్రవారం రేపే కావడంతో పూర్ణమార్కెట్ లో వీధులు మహిళలతో కిక్కిరిసిపోయాయి.పూల దూకాణాలు రద్ధిగా కనిపించాయి.
శ్రావణమాసం రావడంతోనే మహిళలకు పండగ వాతావరణం నెలకొంటుంది.కొత్త బట్టలు,బంగారం కొనుగోలు చేసి,మొదటిగా అమ్మవారికి అలంకరించి తరువాత మేము ఉపయోగిస్తామని మహిళలు అంటున్నారు.శ్రావణ శుక్రవారం పూజు చేయడం అందరు సంతోషంగా ఉంటామని,ఆరోగ్యంగా ఉంటామని మహిళలు అంటున్నారు.ముఖ్యంగా లక్ష్మీదేవి సిరిసంపదలు అమ్మవారు వెదజల్లుతారని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.అయితే మార్కెట్ లో మాత్రం పూలు,పూజా సామాగ్రి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని భక్తులు వాపోతున్నారు.

















