భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి మృతితో యావత్ దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. వాజ్‌పేయి మృతి పట్ల రాజకీయ నేతలు, ప్రముఖులు, విదేశీ నేతలు సంతాపం ప్రకటిస్తున్నారు. వాజ్‌పేయిని కడసారిచూపు చూసేందుకు ఇప్పటికే దేశ నలుమూలల నుంచి రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఢిల్లీకి తరలివస్తున్నారు. వాజ్‌పేయి మరణంతో ఆగస్టు 22వరకు ఏడు రోజులు సంతాపదినాలుగా కేంద్రప్రభుత్వం ప్రకటించింది. వాజ్‌పేయి మృతికి సంతాపంగా భారతీయ జెండాను సగం వరకు అవతనం చేయనున్నారు.