థాయ్‌లాండ్‌లోని గుహ నుంచి ఈరోజు మరో ముగ్గురు చిన్నారులను సహాయ సిబ్బంది బయటకు తీశారు.
18 రోజులు గుహలో గడిపిన అనంతరం వారు బయటకు వచ్చారు. సహాయక చర్యలు చేపడుతున్న ప్రాంతం నుంచి అంబులెన్స్‌లో వారిని ఆస్పత్రికి తరలించారు.
ఇప్పటికి పదకొండు మందిని కాపాడి బయటకు తీసుకొచ్చినట్లు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న అధికారి పేర్కొన్నారు.
ఒకరిని స్ట్రెచర్‌పై తీసుకెళ్తుండగా చూసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. డైవర్ల సహాయంతో ఆదివారం నలుగురు, సోమవారం నలుగురు బాలురు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇప్పటి వరకు బయటకు వచ్చిన చిన్నారులను అధికారులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి వివరాలను ఇంకా బయటపెట్టడం లేదు.
వారికి ఇన్ఫోక్షన్లు సోకే ప్రమాదం ఉండటంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంకా చిన్నారులు వారి తల్లిదండ్రలతో కూడా కలవనీయడం లేదు.
తొమ్మిది మంది సురక్షితంగా బయటకు రావడంతో ఇంకా గుహ లోపల ఓ చిన్నారి, కోచ్ ఉన్నారు. థాయ్‌లాండ్ ప్రధానమంత్రి ప్రయుత్ చాన్-ఓచా ఆస్పత్రిలో ఉన్న చిన్నారులను కలిసినట్లు తెలుస్తోంది.
సహాయక చర్యలు చేప్టటే ప్రాంతానికి వెళ్దామని భావించినప్పటికీ అక్కడ పనులకు ఆటంకం కలుగుతుందనే ఉద్దేశ్యంతో ఆస్పత్రికి వెళ్లి చిన్నారులను కలిసినట్లు తెలుస్తోంది. మిగిలిన వారిని కూడా కాపాడేందుకు నేవీ సిబ్బంది తీవ్రంగా పయత్నిస్తున్నారు.

















