వీరంతా సురక్షితంగా బయటకు రావాలని ప్రార్థిస్తూ ప్రముఖ సైకత శిల్ప కళాకారుడు సుదర్శన్ పట్నాయక్.. పూరీ తీరాన ప్రత్యేక సైకతశిల్పాన్ని రూపొందించారు.
గుహలో బాలురు చిక్కుకున్నట్లుగా ఉన్న సైకతశిల్పాన్ని తీర్చిదిద్దిన సుదర్శన్.. వారంతా క్షేమంగా బయటకు రావాలని ప్రార్థిద్దాం అని పిలుపునిచ్చారు.
దీంతో పాటు బాలురను బయటకు తీసుకొచ్చే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన డైవర్ సమన్ కునన్‌కు కూడా ఈ సందర్భంగా సుదర్శన్ పట్నాయక్ నివాళులర్పించారు. ఆ డైవర్ నిజమైన హీరో అని, అతడి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.
చిన్నారులను బయటకు తీసుకొచ్చేందుకు ఆదివారం నుంచి సహాయకచర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.
ఆదివారం నలుగురు, సోమవారం మరో నలుగురిని గుహ నుంచి బయటకు తీసుకొచ్చారు. ఇంకా నలుగురు బాలురతో పాటు కోచ్‌ను కూడా రక్షించాల్సి ఉంది. మంగళవారం నాటికి వీరంతా సురక్షితంగా బయటకు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో కరువు నేలపై కేంద్రం వివక్ష పేరిట దీక్ష చేపట్టనున్నారు.
దీనికి సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వ చీప్ విఫ్ పల్లె రఘునాథరెడ్డి స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా పల్లె రఘునాథరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేంద్రంపై ఎన్ని విధాలుగా చేసినా దిగిరాకపోయేసరికి ప్రజల్లోకి వచ్చామని, కేంద్రం చేసిన మోసాన్ని, తీరును ఎండగట్టడానికి ఇక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో సుమారు 60 వేల మంది ప్రజలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని పల్లె రఘునాథరెడ్డి తెలిపారు.
దీంతో స్థానికులు భయాందోళనలు చెంది.. పరుగులు తీశారు. స్థానికులు పాములు పట్టేవాళ్లకు సమాచారం అందించారు.
స్థానికంగా ఉండే భాస్కర్ నాయుడు అనే`పాములు పట్టే వ్యక్తి అక్కడికి వచ్చి జెర్రిపోతును చాకచక్యంగా పట్టుకున్నాడు.
పట్టుకున్న పామును దగ్గరలోనే అడవి ప్రాంతంలో విడిచిపెట్టారు. గతంలోకూడా పలుమార్లు విషసర్పాలు బాలాజీనగర్ వాసులను భయభ్రాంతులకు గురిచేశాయి.