సోమవారం మలికిపురం మండలం తూర్పుపాలెం వద్ద కేశనపల్లి జిసిఎస్ సమీపంలో 15 వ నెంబర్ బావికి చెందిన పైప్ లైన్ నుంచి గ్యాస్ బయటకు రావటంతో స్థానిక ప్రజలు భయాందోళన చెందారు.
ఈ ఘటన మరువక ముందే మరలా మంగళవారం మద్యాహ్నం మలికిపురం మండలం తూర్పు పాలెం లోని గొల్లపాలెం ఒఎన్జీసి బావి నుండి పెద్ద పెద్ద శబ్దాలతో క్రూడాయిల్ తో కుడిన గ్యాస్ 20 అంగుళాల ఎత్తు కు పైకి వ్యదజల్లడం తో స్థానిక ప్రజలు భయాందోళన చెందారు.
సమాచారం అందుకున్న అధికారులు వెంటనే స్పందించి సంబంధిత వెల్ వద్ద వాల్వు మూసి గ్యాస్ లీకేజ్ ని నిలుపుదల చేశారు.
తుప్పు పట్టిన పైప్ లైన్ ల కారణంగా తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ONGC అధికారులు పట్టించుకోవటం లేదని కోనసీమ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పైప్ లైన్ లు అదునికరణ చేసిన తరువాతే గ్యాస్ నిక్షేపాలు వెలికితీయాలని పూర్తి స్థాయిలో నూతన గ్యాస్ పైప్ లైన్ లను నిర్మించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు