రేపు ఘనంగా తెరుచుకోనున్న Kedarnath Temple
హిమాలయాల మధ్యలో ఉన్న ప్రసిద్ధ శైవక్షేత్రం కేదార్నాథ్ ఆలయం రేపు ఉదయం 8 గంటలకు భక్తులకు తిరిగి అందుబాటులోకి రానుంది. వేద మంత్రాలు, సంప్రదాయ పూజలు పూర్తి చేసిన అనంతరం ఆలయ ద్వారాలు తెరుస్తారు.
శీతాకాలంలో మూసివేసిన ఈ ఆలయంలో రేపటి నుంచి భక్తులు కేదారేశ్వరుడిని దర్శించుకోగలరు. ఆలయాన్ని సర్వాంగసుందరంగా అలంకరించారు. ప్రత్యేకంగా 51 క్వింటాళ్ల పూలతో ఆలయ ప్రాంగణం అద్భుతంగా ముస్తాబు చేయడం విశేషం.
భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. హిమాలయ ప్రాంతంలో ఉన్న ఈ పవిత్ర క్షేత్రంలో భక్తి వాతావరణం నెలకొంది.













