దివంగత ఏపి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మానస పుత్రుక ఆరోగ్యశ్రీ 108 ను మళ్ళీ ఆయన తనయుడు ఈ నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపి ప్రజలకి అందుబాటులోకి తీసుకు రావటం అందులో కరోనా కాలంలో అత్యవసర వైద్య సేవలను సామాన్యులకు అందేలా జిల్లాలకి అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చిన నేపద్యం లో చిత్తురు జిల్లా నగరి నియోజకవర్గ ప్రజలకు మొత్తం పది వాహనాలను అందుబాటులోకి చెచ్చారు. ముందుగా స్థానిక పున్నమి జంక్షన్ వద్ద గల దివంగతనేత వైఎసార్ విగ్రహాన్ని గజ మాలతో సత్యరించిన నగరి ఎమ్మేల్యే ఆర్కేరోజా తన నియోజకవర్గానికి కేటాయించిన 108, 104 వాహనాలకు ఏర్పాటుచేసి నపూజా కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం తొలి వాహనాన్ని కుయ్ కుయ్ కుయ్ అంటూ సైరన్ మొగిస్తూ పుత్తూరు నగర వీధుల్లో తానే స్వయంగా నడిపి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మానసపుత్రిక అరోగ్యశీ 108 ఏపి ప్రజలకి అందుబాటులోకి తెస్తే ఆయనకొడు నాలుగు అడుగులు ముందుకు వేసి 108 104 మాత్రమే కాకుండా పేద ప్రజలకి విలేజ్ క్లీనిక్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి చరిత్ర తిరగరాశారని చెప్పుకొచ్చారు

















