TDP Ex Minister Bandaru Satyanarayana Was Arrested by Police Visakhapatnam Vizagvision జిల్లాలోని పెందుర్తి రాతిచెరువు సమీపంలో ఉన్న టిడ్కొ ఇళ్ల నిర్మాణ పనులను సందర్శించేందుకు వెళ్లిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణను పెందుర్తి పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇల్లు అర్హులైన లబ్ధిదారులకు కేటాయించాలని కోరుతూ టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కాగా కోవిడ్ నేపథ్యంలో ఎక్కువ మంది గుమిగూడారు అంటూ బండారు సత్యనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

















