ప్రముఖ వైద్యులు డాక్టర్ కూటికుప్పల సూర్యారావు సతీమణి kutikuppala గృహలక్ష్మి శుక్రవారం హఠాత్ మరణం చెందారు. మురళి నగర్ లోని ఇంట్లో ఉండగా చాతి నొప్పి రావడంతో ఆమెను అపోలో ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. గుండెపోటుతో ఆమె మరణించి నట్టు తెలుస్తోంది. డాక్టర్ కూటికుప్పల సూర్యారావు తో పాటు పలు సామాజిక కార్యక్రమాల్లో గృహలక్ష్మి పాల్గొనేవారు. మురళి నగర్ లో వనిత వాకర్స్ క్లబ్ తో పాటు పలు మహిళ సామాజిక చైతన్య సంస్థల్లో గృహలక్ష్మి కీలక భూమిక పోషించారు. నగరంలోని పలు ఆలయాలకు ఆధ్యాత్మిక సేవ తో పాటు అభివృద్ధిలో కూడా కూటికుప్పల గృహలక్ష్మి విశేష సేవలందించారు. ఆమె అకాల మరణం పై విశాఖ లోని పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖ నగరం ఓ ఆధ్యాత్మిక… మహిళా సేవకురాలిని కోల్పోయిందని పలువురు పేర్కొన్నారు. విశాఖ ఏజెన్సీలోని పలు గిరిజన గ్రామాలకు వైద్యంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనలో డాక్టర్ కూటికుప్పల సూర్యారావు వెంట దశాబ్దాల క్రితమే గృహలక్ష్మి సేవలందించారు.

















