Alluri SeethaRama Raju Jayanthi Utsavalu at Pandrangi in Visakhapatnam,Vizagvision…అల్లూరి సీతారామరాజు జన్మస్థలం, సమాధుల అభివృద్థికి 2.50 కోట్లు
• పాండ్రింగిలో అల్లూరి సీతారామరాజు (123వ జయంతి) విగ్రహానికి పూలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు
విశాఖపట్నం, జూలై,04 అల్లూరి సీతారామరాజు ఉన్నంత కాలం దేశం కోసం జీవించిన వ్యక్తి అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు 123వ జయంతి సందర్భంగా ఆయన జన్మించిన స్థలం పాండ్రింగిలో జయంతి ఉత్సవాలలో శనివారం పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు జన్మస్థలమైన పాండ్రంగిలో మ్యూజియంను 2 కోట్ల రూపాయలతో అభివృద్థి చేయనున్నట్లు వెల్లడించారు. గొలుగొండ మండలం కృష్ణదేవిపేటలో ఆయన సమాధి ఉన్న ప్రాంతంను 50 లక్షల రూపాయలతో అభివృద్థి చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఈ పనులను వచ్చే జయంతి నాటికి పూర్తి చేసి ప్రారంభిస్తామని చెప్పారు. బ్రిటిష్ వారినే గడగడలాడించిన మహోన్నత వ్యక్తి అల్లూరి అని కొనియాడారు. చిన్న వయసులోనే మన్యంలో తిరిగి తెల్ల దొరలు అమాయక గిరిజనుల పై చేస్తున్న దురాగతాలు, దోపిడీలను అరికట్టేందుకు వారి హక్కులను కాపాడేందుకు విశేష కృషి చేసినట్లు తెలిపారు. రానున్న కొత్త జిల్లాలలో ఏదో ఒక జిల్లాలకు అల్లూరి సీతారామరాజు గారు పేరు పెట్టేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెల్లనున్నట్లు చెప్పారు. పద్మనాభం మండలంలో ఒక జూనియర్ కళాశాల ఏర్పాటు చేసి దానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టనున్నట్లు తెలిపారు. పాండ్రంగి వద్ద వంతెన నిర్మాణంనకు నిధులు మంజూరుకు జి.ఓ. తీసుకువచ్చి త్వరలోనే శంకుస్థాపన చేస్తామన్నారు. స్థానికంగా ఉన్న సమస్యలు పరిస్కరిస్తామని చెప్పారు. పాండ్రంగి గ్రామాన్ని మండల కేంద్రంలా అభివృద్థి చేయనున్నట్లు పేర్కొన్నారు. పద్మనాభం మండలం అభివృద్థికి తనవంతు కృషి చేస్తానన్నారు. రాష్ట్రంలో ఎలాంటి వివక్ష లేకుండా అర్హత గల ప్రతి ఒక్క పేదవారికి ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని ముఖ్యమంత్రి చెప్పినట్లు తెలిపారు. అవినీతికి తావులేకుండా పారదర్శకంగా పాలన ఉంటుందన్నారు. కోవిడ్-19 విస్తరించకుండా ప్రతీ ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్ లు ధరించాలని చెప్పారు. విత్తన అభివృద్థి కేంద్రాన్ని అభివృద్థి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ రాబోయే తరాలకు తెలియజేసేందుకు అల్లూరి సీతారామరాజు యొక్క జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలన్నారు. పార్లమెంటులో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఏర్పాటుకు కృషి చేయాలని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. పర్యాటక శాఖ ఆర్డీ, తదితరులు మాట్లాడుతూ ఆయన పోరాట పటిమను, ఆయన ఆశయాలను నేటి యువత స్పూర్తిగా తీసుకోవాలన్నారు. అంతకు ముందు పాండ్రంగి ఊరుకు ముందుగా ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అక్కడ నుండి ఆయన జన్మించిన గృహం వద్దకు వెళ్లి అక్కడ తన తల్లి విగ్రహానికి, అల్లూరి సీతారామరాజు విగ్రహం, చిత్రపటాలకు పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం 108, 104 వాహనాలను ఆయన ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముందుగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమాచార శాఖ ఉప సంచాలకులు వి. మణిరాం వందన సమర్పనతో కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం ఆర్డిఓ పెంచల కిషోర్, పర్యాటక శాఖ ఆర్.డి., టి.ఐ.ఓ. పూర్ణిమాదేవి, మండల తహసిల్థార్, ఎంపిడిఓలు, ఆ గ్రామానికి చెందిన ప్రశాంత్ రాజు, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.

















