వలస కార్మికులు మూకుమ్మడిగా రోడ్డుపై కూర్చోబెట్టి వారిమీదకు క్రిమిసంహారక మందుతో పిచికారీ చేశారు in UP,Vizagvision…వలస కార్మికుల స్థితిగతులపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన రోజులే ఈ ఘోరం చోటుచేసుకున్నది. ఢిల్లీ నుంచి అష్టకష్టాలు పడి యూపీ చేరుకున్న వలస కార్మికుల కుటుంబాలకు చేదు అనుభవం ఎదురైంది. అందరినీ మూకుమ్మడిగా రోడ్డుపై కూర్చోబెట్టి వారిమీదకు ఆరోగ్యసేవల సిబ్బంది సూక్ష్మక్రిమిసంహారిణులను స్ప్రే చేశారు.
పోలీసులు చూస్తుండగానే ఈ ఘటన జరిగింది.
మీ కళ్లు మూసుకోండి, పిల్లల కళ్లు మూయండి అని గద్దిస్తూ స్ప్రే చేస్తుంటే వలస కార్మికులు, వారి కుటుంబ సభ్యులు నిస్సహాయంగా కేకలు వేశారు. ఒంటిమీద రసాయనంతో, కళ్లమంటలతో ఇబ్బంది పడ్డారు. బరేలీ జిల్లాలో జరిగిన ఈ అమానుష ఘటనపై సామాజిక మాధ్యమాల్లో గగ్గోలు తలెత్తడంతో జిల్లా యంత్రాంగం వివరణలు ఇచ్చుకోవడం మొదలుపెట్టింది. అమానుషంగా వ్యవహరించాలని కాదు.. అందరి మేలు కోరి అలా చేశాం అని పేలవమైన సంజాయిషీ ఇచ్చుకుంది
















