పవన్ కల్యాణ్ ,చంద్రబాబులు రాష్ట్రాన్నికి పట్టిన పొలిటికల్ వైరస్ లు, YCP MLA Amarnadh in Visakhapatnam,Vizagvision…
పార్టీ ఎంఎల్ ఏ శ్రీ గుడివాడ అమర్ నాధ్ కామెంట్స్….
పవన్ కల్యాణ్ ,చంద్రబాబులు రాష్ర్టానికి పట్టిన పొలిటికల్ వైరస్ లు
హైద్రాబాద్ లో ఉన్నారు కాబట్టి సరిపోయింది.ఇక్కడ ఉంటే ఎన్ని రాజకీయాలు చేసేవారో
అందరికి ఆదర్శంగా సేవలందిస్తున్న వాలంటీర్ల వ్యవస్దనే విమర్శిస్తారా
మర్యాదగా వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలను వెనకకు తీసుకోండి
ఈరోజు కరోనా వైరస్ ప్రపంచంలో సృష్టిస్తున్న మరణమృదంగాన్ని మనం చూస్తున్నాం
ప్రపంచంలోనే శక్తివంతమైన దేశాలుగా చెప్పుకునే అమెరికా,చైనా,ఇటలీలాంటి అనేక దేశాలు వారి మొండితనం,నిర్లక్ష్యవైఖరి,వారు వ్యవహారశైలివల్ల ఆయా దేశాలలో ఏరకమైన పరిస్దితులు ఉన్నాయో మనందరం చూస్తున్నాం.
సమయానికి వైద్యం అందక రోడ్లపైన, చెట్లకింద వైద్యం చేస్తున్న పరిస్దితులు మనం చూస్తున్నాం.
రోజురోజుకూ వేలాదిగా పెరుగుతున్న మరణాలు చూస్తున్నాం.రోజుకు 15 నుంచి 20వేలుగా పెరుగుతున్న కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న అమెరికాను చూస్తున్నాం.
ఇలాంటి పరిస్దితులలో ప్రధానినరేంద్రమోది,ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ లు తీసుకుంటున్న నిర్ణయాలు. మార్చి 22 న జనతా కర్ఫ్యూ దగ్గరనుంచి ఏప్రిల్ 14 వతేదీవరకు లాక్ డౌన్ వరకు పెద్దఎత్తున ప్రజలు స్వచ్చంధంగా పాల్గొంటున్నారు.
లాక్ డౌన్ లో భాగస్వాములై ప్రజలందరూ కూడా ఇళ్లకే పరిమితమయ్యారు.భారతదేశంలో ఈ పర్యవసనాల నేపధ్యంలో దేశవ్యాప్తంగా వేయిపైచిలుకు కేసులు,రాష్ర్టంలో 23 కేసులుకు మాత్రమే నమోదు అయ్యాయి.
ఈరోజు మనం పాటిస్తున్న అనేక విధానాలు,శ్రీ వైయస్ జగన్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఇతర రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి.
రాష్ర్టాన్ని ప్రజలను కరోనానుంచి ఏరకంగా కాపాడాలి,ఎదుర్కోవాలి అనే ఆలోచనతో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారు ఉంటే ఈ స్దితిలో కొన్ని రాజకీయపార్టీలనేతలు చేస్తున్న విమర్శలు చూస్తే బాధనిపిస్తోంది.
ముఖ్యంగా ఈరోజు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్ చూస్తే ఆయన ఒకటి గుర్తుంచుకోవాలి.వాలంటీర్ల వ్యవస్ద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవస్దకాదు.రాష్ర్ట ప్రభుత్వానికి సంబంధించింది.ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలాంటిది.
పక్కరాష్ర్టాలకు సైతం ఆదర్శంగా నిలిచింది.ఇంగ్లండ్ లో సైతం ఇలాంటి వ్యవస్దను ఏర్పాటుచేయాలని ఆలోచన చేసిన వ్యవస్ద.దేశంలో గ్రామస్వరాజ్యం ఉండాలి అలా ఉంటేనే దేశానికి మంచిది అని పూజ్యబాపూజి నినాదానికి ఆదర్శంగా నిలిచిన వ్యవస్ద.
ఇలాంటి వ్యవస్ద గురించి చెడుగా ఎలా మాట్లాడారో నాకు అర్దం కావడం లేదు.మీరు హైద్రాబాద్ లో ఉన్నంతమాత్రాన వాలంటీర్లు మీ ఇంటికి వస్తారనుకుంటే మేం ఏమీ చేయలేం.ఈరోజు మీ పార్టనర్ చంద్రబాబు కూడా హైద్రాబాద్ లో ఉన్నారు.
ఈరోజు మీరు ఏపికి రావాలన్నా, బోర్డర్ దాటాలన్నా అవకాశం లేదు.కాని మీ మాటలు మాత్రం హద్దులు దాటుతున్నాయి.
ప్రపంచం అంతా కరోనాను ఎదుర్కొనేందుకు పనిచేస్తుంటే, పనిచేస్తున్నవారి ఆత్మస్దైర్యాన్ని దెబ్బకొట్టేవిధంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు.
చాలా సందరర్భాలలో మేం చెప్పాం.చెగువేరా,భగత్ సింగ్ ,అల్లూరిసీతారామరాజు ఫోటో పెట్టుకుంటే వారిలాగా అయిపోం.వారి ఆలోచనలకు ఆశయాలకు, అనుగుణంగా నడిస్తేనే మనం ఫోటోలు పెట్టుకోవాలి.
సినిమాలకోసమో సినిమాలలో మాట్లాడినమాటలు బయటకూడా మాట్లాడితే పెద్ద నాయకులు అయిపోరని గమనించాలి.
వాలంటీర్లు ప్రాణాలకు తెగించి ఇంటింటికి వెళ్లి సర్వేలు చేసి ఏప్రిల్ 1 వతేదీన పెన్సన్లు ఇవ్వబోతున్నారు.ప్రతి ఇంట్లోకి వెళ్లి విదేశాలనుంచి ఎవరెవరు వచ్చారు.కుటుంబాలలో ఆరోగ్యపరిస్దితుల గురించి సర్వే చేసిందెవరు.
రాష్ర్టంలో పేదవారు వారి ఇంటినుంచి కాలు కూడా బయటపెట్టకుండా అనేక పనులు వాలంటీర్లు చేస్తున్నారు.ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేస్తున్నారు.
ఈ రాష్ర్టం గురించి, వ్యవస్దల గురించి, దేశం గురించి మీకు ఎంత చిత్తశుద్ది ఉందో అందరం కూడా జనతాకర్ఫ్యూ రోజున చూశాం.దేశానికి సేవచేస్తున్న వారికి కృతజ్ఞతగా చప్పట్లు కొట్టమని నరేంద్ర మోదిగారు పిలుపు ఇచ్చారు.ఆరోజు మీ గార్డెన్ లో కూర్చుని గంట కొట్టుకున్నారు.అందులో వెటకారం కనపడింది.
మీకు ఏపిపై కక్ష ఏంటి.ప్రతి వంద,50 కుటుంబాలకోసం పనిచేస్తున్న వ్యవస్ద వాలంటీర్ల వ్యవస్దగురించి మీరు ఇక్కడ ఉంటే వారి విధివిధానాలు మీకు తెలుస్తాయి.
రెండున్నరలక్షల మందితో కూడిన వాలంటీర్ల వ్యవస్దను ఆత్మస్దైర్యం దెబ్బతీసేవిదంగా వ్యాఖ్యలు చేస్తారా.
మీరు మీ భాగస్వామి చంద్రబాబుల తీరు ఒకే విధంగా ఉంది.చంద్రబాబు ఆయన కుమారుడు,మనవడు కలసి ఇంటిపై జెండా ఎగరేసుకుంటారు.మీరు లాన్ లో కూర్చుని గంట కొట్టుకుంటారు.నిజంగా మీకు హేట్సాప్ చెప్పాలి.
కరోనా వైరస్ ప్రజలకు, ప్రజల ఆరోగ్యానికి వస్తే మీలాంటి వారు పొలిటికల్ వైరస్ లు.మీరు, చంద్రబాబు రాష్ర్టానికి పట్టిన పొలిటికల్ వైరస్ లు.
మీరు మీ భాగస్వామి హైద్రాబాద్ లో ఉన్నారు కాబట్టి సరిపోయింది.లేకపోతే ఇంకెన్ని రాజకీయాలు చేసేవారో.
వాలంటీర్ల పై మీరు చేసిన వ్యాఖ్యలను వెనకకు తీసుకోండి.క్లిష్టసమయాల్లోఐనా రాజకీయాలు మానివేసి ప్రజల గురించి ప్రజలకోసం పనిచేసేవారిపై మీరు చేసిన వ్యాఖ్యలు వెనకకు తీసుకోండి.
















