ప్రభుత్వం నిర్వహించే ఈవెంట్లు స్థానిక ఈవెంట్ మేనేజర్స్ కు అప్పగించాలని by VEMA in Visakhapatnam,Vizagvision…విశాఖ ఉత్సవాలు, భీమిలి ఉత్సవాలు లాంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలను ప్రభుత్వం స్థానిక ఈవెంట్ మేనేజర్స్ కు అప్పగించాలంటూ విశాఖపట్నం ఈవెంట్ మేనేజర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాము ఎంతో మంది బ్యాక్ డ్రాప్, సౌండ్స్, ఫ్లెక్స్ ప్రింటింగ్ తదితర అంశాలకు చెందిన నిరుద్యోగులకు ఉపాధిని సైతం కల్పిస్తున్నామన్నారు. తమకు కూడా ప్రభుత్వం సంక్షేమ పథకాలను వర్తింపచేయాలని ఆయన కోరారు. తమకు ఈవెంట్స్ ను ప్రభుత్వం అప్పగిస్తే ఎటువంటి రిమార్కులు లేకుండా చేసి చూపించే అనుభవం కూడా ఉందన్నారు. ఈవెంట్ మేనేజ్మెంట్ లో తమకు సుమారు 22 నుంచి 25 సంవత్సరాల అనుభవం కూడా ఉందన్నారు. కొటేషన్స్ ద్వారా ఈవెంట్ లకు ప్రభుత్వం బిడ్డింగ్ నిర్వహించాలన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కార్యదర్శి వాసు,M.SRINIVAS తదితరులు పాల్గొన్నారు.

















