నగరంలోని సంపత్ వినాయక టెంపుల్ రోడ్డులో షిమి వోగ్ మొదటి అవుట్‌లెట్‌ను సినీ నటి, బిగ్‌బాస్ ఫేమ్ హిమజ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ స్టోర్ అన్ని వర్గాల ప్రజలు వినియోగించుకునే విధంగా ఉందన్నారు. ఈ స్టోర్ ప్రత్యేకత ఏమిటంటే.. అన్ని రకాల వస్తువులు సరసమైన ధరలకే లభించునని తెలిపారు. ఇటువంటి స్టోర్లు మరిన్ని ఏర్పాటు కావాలన్నారు.
ఈ సందర్భంగా షిమి వోగ్ స్టోర్ (వైజాగ్) అధినేత కందుల నవీన్‌కుమార్ మాట్లాడుతూ ఈ అవుట్‌లెట్‌లో కాస్మోటిక్స్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ వస్తువులు, గృహోపకరణాలు, పిల్లల బొమ్మలు, నిత్యావసర వస్తువులు, వింటర్ వేర్, సమ్మర్ వేర్, అన్ని సీజనల్ వేరబుల్ థింగ్స్, పాదరక్షలు, గిఫ్ట్ ఐటెమ్‌లు, తదితర ఉత్పత్తులు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అత్యున్నత మన్నిక కలిగి అద్భుతమైన డిజైన్లతో సరసమైన ధరలతో ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల మన్ననలు పొందుతుందన్నారు. మీ నిత్యావసరాలను తీర్చే స్టోర్ షిమి వోగ్ అనడంలో సందేహం లేదు.
భారతదేశంలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే షిమి వోగ్ అభివృద్ధి చెందడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ అవుట్‌లెట్‌లో వినియోగదారులు అత్యున్నతమైన భారీ ఆఫర్లను సొంతం చేసుకోవచ్చన్నారు. 2015 లో ప్రారంభించబడిన కొరియాకు చెందిన షిమి వోగ్ డిజైనర్ బ్రాండ్ మాల్స్ ఫ్యాషన్ ప్రపంచంలో అత్యున్నత ప్రమాణాలు కలిగి ఉందన్నారు. ఈ స్టోర్‌లో రూ.75 నుంచి రూ.1500 విలువ కలిగిన ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా, కెనడా, రష్యా, సింగపూర్, స్పెయిన్, యూఏఈ తదితర 77 ప్రాంతాల్లో దీని అవుట్లెట్లు ఉన్నాయని తెలిపారు. ఇండియాలో 70కిపైగా అవుట్లెట్లు ఉన్నాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 1700 పైగా అవుట్లెట్లు ఉన్నాయన్నారు.
















