తీర ప్రాంతాలను అప్రమత్తం చేస్తున్న జాయింట్ కలెక్టర్…
విశాఖ జిల్లాలో పెథాయ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను జిల్లా అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. పాయకరావుపేట తీర ప్రాంతంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సృజన పర్యటించారు.
పెథాయ్ తుఫాను తీవ్రత నుంచి విశాఖ జిల్లా ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా పాయకరావుపేట నియోజకవర్గంలో తీర ప్రాంతాలైన బంగారమ్మ పాలెం, రేవుపోలవరం, తీనార్ల, రాజయ్యపేట, బంగారయ్య పేట, తదితర గ్రామాల్లో విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ సృజన తో పాటు ఇతర అధికారులు పర్యటించారు. తుఫాన్ సమయంలో ప్రజలు ఉండడానికి తుఫాన్ భవనంలో ఏర్పాట్లను పరిశీలించారు. అదేవిధంగా బాధితులకు ఆహారం అందించే విషయంలో ఎటువంటి లోటు పాట్లు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వైద్య సిబ్బందికి, రెవెన్యూ మరియు పోలీసులకు పలు సూచనలు చేశారు.