ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 24 గంటల్లో తుఫాను గా మారి , రానున్న 36 గంటల్లో తీవ్ర తుఫాను గా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ అధికారులు తెలిపారు. ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తున్న ఈ వాయుగుండం మచిలీపట్నం కు ఆగ్నేయంగా 1090 కిలోమీటర్లు , చైన్నై కి తూర్పు ఆగ్నేయంగా 930 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం ఉందని తెలిపారు. అయితే ఈ తుఫాను 17వ తేది సాయంత్రం కి ఒంగోలు , కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉందని , తీరం దాటే సమయంలో గంటకు 80 నుండి 90 వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. దీని ప్రభావంతో ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ముత్స్యకారులను చేపల వేటకు వెల్లవద్దని , ప్రదాన ఒడరేవుల్లో ఒకటో నెంబర్ హెచ్చరిక జారీ చేసినట్టు వాతావరణ అధికారులు తెలిపారు.

















