మూలనక్షత్రం రోజున ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులైన సతీమణి భూవనేశ్వరీ, కోడలు బ్రహ్మణీ, మనుమడు దేవాన్ష్ తో విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఇ.ఓ వి. కోటేశ్వరమ్మ , జిల్లా కలెక్టర్టర్ లక్ష్మీకాంతంతో పాటు పాలక మండలి సభ్యులు, ఇతర అధికారులు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు ఘన స్వాగతం పలికారు. ఆనంతరం వేద పండితులు వేద మంత్రోచ్చరణలు, మంగళవాయిద్యాలు, పూర్ణ కుంభంతో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులను ఆలయం లోనికి తీసుకువేళ్ళారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విలేకరులతో మాట్లాడుతూ,
ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది, ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
రాష్ట్రాన్ని చల్లగా చూడమని అమ్మవారిని ప్రార్దించడం జరిగింది.
ప్రజలకు మేలైన జీవన విధానాన్ని కలుగచెయ్యమని
కోరడం జరిగింది.
రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి సాధించాలని ప్రార్థిించడం జరిగింది. సిఎమ్
దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తున్నాము. ఇందుకు నిదర్శనం దర్శించుకున్న భక్తులే నిదర్శనం.
గత ఏడాది 2 లక్షల 95వేల మంది తొలి నాలుగు రోజుల లో దర్శించుకుంటే, ఈ ఏడాది 5 లక్షల 23 వేల మంది దర్శించుకున్నారు. ఇప్పటికే రెట్టింపు భక్తులు దర్శించుకున్నారు