కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. భార్య, పిల్లల పేర్లతో ముగ్గురిని అమెరికాకు అక్రమ రవాణా కేసులో నిన్న అరెస్టయిన జగ్గారెడ్డిని పోలీసులు ఉదయం గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం జగ్గారెడ్డిని పోలీసులు సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టులో హాజరు పరిచారు. విచారించిన సిటీ సివిల్ కోర్టు జగ్గారెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం జగ్గారెడ్డిని పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు.