కొండగట్టు ఘాట్ రోడ్డుపై ఆర్టీసీ బస్సు బోల్తా పడి 43 మంది మరణించిన ఘోర రోడ్డు ప్రమాదం పట్ల కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని పేర్కొన్నారు. ప్రమాదం ఘటనపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు