టీటీడీపీ ముఖ్య నేతలతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఇవాళ భేటీ అయ్యారు. పొత్తుల సంప్రదింపుల కమిటీ, మేనిఫెస్టో కమిటీ, ప్రచార కమిటీలపై చంద్రబాబు చర్చిస్తున్నారు. కలిసి వచ్చే పార్టీలతో త్వరలోనే పొత్తుల చర్చలు చేయాలని భావిస్తున్న టీడీపీ.. సీట్ల సర్దుబాటుపైనా దృష్టి పెట్టింది. సుమారు 40 అసెంబ్లీ సెగ్మెంట్లలో టీడీపీకి అధిక సంఖ్యలో ఓట్లు పడతాయని టీడీపీ అంచనా వేస్తోంది. పొత్తులపై అంగీకారానికి వస్తే.. రెండు పార్లమెంట్ సెగ్మెంట్లలో పోటీ చేయాలని టీడీపీ భావిస్తున్నట్టు తెలిసింది. ఖమ్మం, మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానాలపై టీటీడీపీ ఆసక్తి కనబరుస్తోంది. ఉమ్మడి హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాలతోపాటు దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు అడగాలని అధిష్టానం భావిస్తోంది…