Majerhat Bridge collapses in South Kolkata,Vizag Vision..
దక్షిణ కోల్‌కతాలోని నిత్యం జనసమ్మర్ధంగా ఉండే మజెర్‌హట్ బ్రిడ్జి మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కుప్పకూలింది.
పలువురు శిథిలాల చిక్కుకుపోయి ఉంటారని అనుమానిస్తున్నారు.
పలు కార్లు కూడా బ్రిడ్జి కింద చిక్కుకున్నాయి.
ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి. బ్రిడ్జి శకలాలు కింద పడటంతో శిథిలాల కింద కార్లు చిక్కుకుపోయాయి.
సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి.
అంబులెన్స్‌లు సైతం సంఘటనా ప్రాంతానికి చేరుకున్నాయి.
బస్సు సర్వీసులు, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం తలెత్తింది