మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి అస్థి కలశాలను వివిధ రాష్ట్రాలకు చెందిన బీజేపీ అధ్యక్షులకు ప్రధాని మోదీ అందజేశారు.
దేశంలోని 100 నదుల్లో ఈ అస్థికలను నిమజ్జనం చేసేందుకు ‘అస్థి కలశ యాత్ర’లను బీజేపీ చేపడుతోంది.
రాష్ట్ర రాజధానుల్లో ఈ యాత్రలు ప్రారంభమై అన్ని బ్లాక్‌లకూ చేరుకుంటాయి.
వివిధ రాష్ట్రాల పార్టీ చీఫ్‌లకు వాజ్‌పేయి అస్థి కలశాలను అందజేసిన కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్, వాజ్‌పేయి దత్తపుత్రిక నమిత భట్టాచార్య తదితరులు పాల్గొన్నారు.
సుదీర్ఘ అస్వస్థతతో ఈనెల 16న వాజ్‌పేయి తుదిశ్వాస విడిచారు.