Heavy Rainfall Forecast over Visakhapatnam,few places in East & West Godavari districts,Vizagvision..ఐఎండి వాతావరణ సూచన ప్రకారం అల్పపీడన ప్రభావంతే
రాగల 24గంటల్లో,.శ్రీకాకుళం, విశాఖపట్టణం, విజయనగరం,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, క్రిష్ణా, గుంటూరు జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంది.ప్రకాశం,నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.రాయలసీమలో పలుచోట తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. అల్పపీడన ప్రభావమతో తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశం మరియు అలలు ఎగసి పడే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని విపత్తుల నిర్వహణ శాఖ సూచిస్తుంది. భారీ వర్షాలు కారణంగా నదీ ప్రవాహం ఉధ్రుతంగా ఉండే అవకాశం ఉన్నందున నదీ పరివాహక ప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు సూచించారు.
కృష్ణా జిల్లా లో ఇప్పటికే అన్ని పాఠశాలలు కళాశాలలు సెలవు ప్రకటించిన ఇన్ చార్జ్ కలెక్టర్ విజయ కృష్ణన్
రాష్ట్రంలో అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కోనసాగుతున్నాయి
పశ్చిమ కృష్ణా లో జగ్గయ్యపేట, నందిగామ ,తిరువూరు లో లోతట్టు ప్రాంతాలలు జలమయం.
నందిగామ కంచికచర్ల వీరులపాడు మండలాల్లో భారీ వర్షాల కారణంగా పొంగిపొర్లుతున్న వాగులు.
కంచికచర్ల చెవిటికల్లు రహదారిపై ప్రవహిస్తున్న సుద్దవాగు పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు….
వీరులపాడు దాములూరు రహదారిపై కూడలి వద్ద ఉదృతంగా ప్రవహిస్తున్న వైరా కట్టలేరు రాకపోకలు నిలిపివేత…
భారీ వర్షాల కారణంగా నీటమునిగిన పంట పొలాలు. చెరువు లను తలపిస్తున్నాయి…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ
ప్రెస్ నోట్
ఐఎండి వాతావరణ సూచన ప్రకారం అల్పపీడన ప్రభావంతే
రాగల 24గంటల్లో
శ్రీకాకుళం, విశాఖపట్టణం, విజయనగరం,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, క్రిష్ణా, గుంటూరు జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంది.