వస్త్ర వ్యాపార రంగంలో తన దైన ముద్ర వేసుకున్న సీఎంఆర్ సంస్థ కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతోంది.గాజువాకలోని సీఎంఆర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన పట్టు వస్త్రాల విభాగాన్ని నటి అనూ ఇమాన్యుల్ ప్రారంభించారు.సంస్థ అధినేత మావూరి వెంకట రమణ మాట్లాడుతూ కస్టమర్లకు అందుబాటులో ఉండేలా అనేక మోడల్స్ ను తీసుకొస్తున్నామని చెప్పారు.నాణ్యతకు పేరుగాంచిన సీఎంఆర్ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో కస్టమర్ల ఆదరాభిమానాలు చూరగొందని తెలిపారు.గోల్డ్ స్కీమ్ అమలు చేసినప్పటినుంచి సామాన్య మధ్యతరగతి కుటుంబాలు సైతం ఆ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాయని కస్టమర్లకు చేరువలో మరిన్ని సేవలు తీసుకు వస్తామని చెప్పారు.నటి అనూ ఇమాన్యుల్ సందడితో షాపింగ్ మాల్ కలకళలాడింది.ఆమెను చూసేందుకు పెద్ద సంఖ్యలో అక్కడికి జనం చేరుకున్నారు