నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైఓవర్ శనివారం తెల్లవారుజామున ఆకస్మాత్తుగా కుప్పకూలింది.
ఉత్తరప్రదేశ్, బస్తీ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో అక్కడ పనిచేస్తున్న కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.
వారిని హుటాహుటిన స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు.
గత వారం రోజులుగా ఆ ప్రాంతంలో వర్షం పడుతుండటంతో ఫ్లై ఓవర్‌కు సపోర్ట్‌గా ఉంచిన బీమ్‌లు భూమిలోకి దిగబడిపోయాయని దీంతో ఈ ప్రమాదం సంభవించిందని ప్రత్యక్ష సాక్షి తెలిపారు.
జాతీయ రహదారి 28పై లక్నోకు 205 కిలోమీటర్ల దూరంలో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారు.
ప్రమాదపు సమాచారాన్ని తెలుసుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.