Praja Sankalpa Yatra Enter into14th Aug in City YCP Amarnath Visakhapatnam,Vizag Vision..232 రోజులుగా సాగుతున్న జగన్ ప్రజాసంకల్ప యాత్ర ఈనెల 14న విశాఖ జిల్లాలో ప్రవేసిస్తుందని అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ కన్వీనర్ గుడివాడ అమర్ ప్రకటించారు. సరిగ్గా నాడు వైఎస్ విశాఖలో ప్రవేశించిన గన్నవరం మెట్టు వద్దనే జగన్ కూడా జిల్లాలో ప్రవేశిస్తారని తెలిపారు.
రాష్ట్రంలో తెలుగుదేశం ఎన్నో అలవికాని హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారానికి వచ్చిందనీ, జగన్ యాత్రలో ఆయా హామీలను నమ్మి తాము ఎలా మోసపోయిందీ జనం చెపుతున్నారనీ అన్నారు. అవి కాక ప్రతి ప్రాంతంలో, ప్రతి జిల్లాలో అనేక స్థానిక సమస్యలు ఆయన దృష్టికి తీసుకు వచ్చారన్నారు. ఆయా సమస్యల మీద ఆయన తగిన విధంగా స్పందిస్తున్నారనీ, హామీలు ఇస్తున్నారనీ అన్నారు. విశాఖ జిల్లాలో కూడా ప్రజలు తమ సమస్యలు పెద్ద ఎత్తున ఆయన దృష్టికి తెస్తారన్నారు. విశాఖ జిల్లాలోని అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన పర్యటన ప్రస్తుతానికి ఖరారైందన్నారు. నర్సీపట్నం నుంచి ప్రారంభించి విశాఖ శివార్ల వరకూ ఆయన పర్యటన సాగుతుందన్నారు.