కోహట్ జిల్లా సమరాయ్ వద్ద ప్రయాణికులతో వెళుతున్న బస్సును ట్యాంకర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో 20 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు.
ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
మృతుల్లో ఓ ఓ చిన్నారి, ఇద్దరు మహిళలు ఉన్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.