బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు చేదు అనుభవం ఎదురైంది. కావలిలో బీజేపీ ర్యాలీలో పాల్గొన్న ఆయనపై గొర్రెపాటి ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి చెప్పు విసిరారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. చెప్పు విసిరిన ఉమామహేశ్వరరావుని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఉమామహేశ్వరరావు స్వస్థలం ప్రకాశం జిల్లా టంగుటూరుగా గుర్తించారు