కేంద్ర అన్యాయంపై అల్లూరి స్ఫూర్తితో పోరాటం
మన్యం వీరుడు సీతారామరాజుకు ముఖ్యమంత్రి ఘననివాళి
అల్లూరి పోరాట పటిమ, మహాత్ముని అహింస మనకు సదా స్ఫూర్తిమంత్రాలని ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కుట్రతో, కక్షతో రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్న కేంద్ర ప్రభుత్వ దుర్విధానాలపై పోరాటానికి అల్లూరి స్ఫూర్తిగా తీసుకోవాలని, తమ ఉద్యమానికి కలసి రావాలని పిలుపునిచ్చారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా బుధవారం ఉదయం ఉండవల్లి గ్రీవెన్స్ సెల్ హాలులో మన్యం వీరుని చిత్రపటానికి పూలమాలవేసి ఘననివాళులర్పించారు.
ప్రశ్నించడం తెలియక, తరాలుగా అంధకారంలో ఉన్న గిరిజనులలో జీవితాల్లో వెలుగునింపిన అల్లూరి సీతారామరాజు తెలుగుజాతి హృదయాలలో కలకాలం నిలిచిపోతారని చంద్రబాబు శ్లాఘించారు. కుట్రతో, కుతంత్రాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకుంటున్న శక్తులపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. జాతీయ భావాలను కలిగి విశాల దృక్పథంతో ఆలోచన చేసిన అల్లూరి సీతారామరాజు ఈ నేలపై జన్మించడం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గర్వకారణమన్నారు.
మహనీయుడు, మహా యోధుడు అల్లూరి స్మృతులు