CM KCR Offers Golden Nose to Kanaka Durga Temple,Vijayawada,Vizagvision..
అనంతరం మీడియా తో మాట్లాడిన కేసీఆర్ విజయవాడ అభివృద్ధి ని , అలాగే తనకు విజయవాడ కున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. విజయవాడ బాగా అభివృద్ధి చెందిందని , ఎయిర్‌పోర్టు కూడా బాగుందని ప్రశంసించారు.
బందర్ రోడ్డును బాగా విస్తరించారని.. ఎయిర్‌పోర్టు నుంచి బందరు రోడ్డు వరకు గ్రీనరీ బాగుందని , రోడ్డుకు ఇరువైపులా పెయింటింగులు చాల కూడా బాగున్నాయని కేసీఆర్ అన్నారు.
రవాణా మంత్రిగా ఉన్నప్పుడు విజయవాడ బస్టాండ్ నిర్మించామని గుర్తు చేసుకున్నారు. ఆసియాలోనే పెద్ద బస్టాండ్‌గా ఉండాలని ఎన్టీఆర్ అన్నారని జ్ఞాపకం చేశారు. బస్టాండ్ పనులను పరిశీలిందుకే అనేక సార్లు విజయవాడ వచ్చానని వెల్లడించారు. దుర్గగుడి బాగా మారిపోయిందని కేసీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు. మళ్లీ ముఖ్యమంత్రిగా వచ్చి అమ్మవారికి మొక్కలు తీర్చుకుంటానని కేసీఆర్ ప్రకటించారు.