Mandava Ravikumar(Balaji Ravi) joined in Jana Sana Party,Visakhapatnam,Vizag Vision.. విశాఖలో ప్రముఖ వ్యాపార వేత్త బాలాజీ సంస్ధల అధినేత మండవ రవికుమార్ (బాలాజీ రవి) జనసేన పార్టీ లో చేరారు. తన అనుచరులు,అభిమానులు పెద్ద ఎత్తున వెంటరాగా ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బస చేసిన ఓ ప్రైవేటు రిసార్ట్ లో ఆయనను కలిసి పార్టీలో చేరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రవికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి అహ్వానించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రజా సేవ కోసం బాలాజీ రవి వంటి వ్యక్తులు రావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేయాలి అనుకునే వారికి జనసేనలో ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుందని పవన్ అన్నారు. జనసేనను క్షేత్ర స్ధాయిలో బలోపేతం చేసేందుకు కృషి చేయాలని ఆయన బాలాజీ రవికి సూచించారు. అనంతరం రవికుమార్ మాట్లాడుతూ జనసేన అధినేత పర్యటనలు ప్రజల్లోకి వెళుతున్న విధానం నచ్చి జనసేనలో చేరినట్లు వెల్లడించారు. ప్రజల వద్దకే వెళుతూ వారి సమస్యలను తెలుసుకనే ప్రయత్నం చేస్తున్న పవన్ కళ్యాణ్ తనకు ఆదర్శమని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ చిత్తశుధ్దితో ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్నారని రవికుమార్ కితాబునిచ్చారు. జనసేన సిద్దాంతాలను , పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు తన వంతు కృషి చేస్తానని రవికుమార్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కోర్ కమిటీ సభ్యులు ఆకుల చంద్రశేఖర్ , ఉత్తరాంద్ర కో ఆర్డినేటర్ శివశంకర్త దితరుల పాల్గొన్నారు