Tractor Overturns and Falls into Canal 14 Members Lost Life Major Road Incident In Nalgonda,VizagVision..వలిగొండలో ట్రాక్టర్ బోల్తా.. 15 మంది మృతి…
యాదాద్రి జిల్లా వలిగొండలో ఘోర ప్రమాదం సంభవించింది. ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో 15 మంది దుర్మరణం పాలయ్యారు. వ్యవసాయ పనుల నిమిత్తం కూలీలతో వెళుతున్న ట్రాక్టర్ వలిగొండ మండలం లక్ష్మాపురం వద్ద అదుపుతప్పి పంటకాల్వలోకి దూసుకెళ్లింది.. ఈ ప్రమాదంలో 15 మంది కూలీలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. వీరిలో 14 మంది మహిళలు కాగా.. ఒక చిన్నారి ఉన్నారు. వీరంతా వేములకొండ వాస్తవ్యులు.. సమాచారం అందుకున్న జిల్లా అధికార యంత్రాంగం హుటాహుటిన ఘటనాస్థలికి బయలుదేరింది.. మృతదేహాలను రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.