STUDY INTER App. MADE BY SURYA CHANDRA PAVAN…vizagvison
-
Previous
Anakapalli court sentenced to life imprisonment for former MLA C.Venkata Rao. ఓ హత్యకేసుకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకటరావుకు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. విశాఖ జిల్లా నక్కపల్లి మండలం బంగారమ్మపేటలో 2007లో జరిగిన ఓ హత్యకేసులో మాజీ ఎమ్మెల్యే సహా 15 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ అనకాపల్లి సెషన్స్ న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఐదుగురు మహిళలకు రెండేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. ఈ కేసులో పోలీసులు మొత్తం 24 మందిని నిందితులుగా చేర్చగా.. వారిలో ముగ్గురు వివిధ కారణాలతో మృతిచెందారు. 2007లో బీచ్ మినరల్స్ కంపెనీ ఏర్పాటు విషయమై బంగారమ్మపేటలో వివాదం చెలరేగింది. మత్స్యకారులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఆ సమయంలో పాయకరావుపేట ఎమ్మెల్యేగా ఉన్న చెంగల వెంకటరావు కంపెనీని వ్యతిరేకిస్తున్న వారితో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కంపెనీ ఏర్పాటుకు అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణలో పూసాల కొండ అనే వ్యక్తి మృతిచెందాడు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం బుధవారం సంచలన తీర్పు వెలువరించింది.గతంలో పాయకరావుపేట నియోజకవర్గం నుంచి తెదేపా తరఫున ఎమ్మెల్యేగా పనిచేసిన చెంగల.. 2014 ఎన్నికల్లో వైకాపా తరఫున పోటీచేసి ఓటమిపాలయ్యారు