New Harbor Police Station Building Sankusthapana by Port Chairman,Visakhapatnam,Vizag Vision..విశాఖలోని రామకృష్ణ జంక్షన్ రైతు బజారు వద్ద నూతనంగా నిర్మిస్తున్న హార్బర్ పోలీస్ స్టేషన్ భవన సముదాయానికి పోర్టు చైర్మన్ కృష్ణబాబు గురువారం శంకు స్ధాపన చేశారు. ఇందుకోసం పోర్టు 1000 చదరపు మీటర్ల భూమిని కేటాయించింది. పోర్టు లోపల స్టాకింగ్ యార్డ్ పునర్నిర్మాణంలో భాగంగా హార్బర్ పోలీస్ స్టేష్ ను సైతం తొలగించారు. విశాఖ కమీషనర్ విజ్ఞప్తి మేరకు పోర్టు యాజమాన్యం రామకృష్ణ జంక్షన్ వద్ద రైతుబజార్ సమీపంలో అందరికి అందుబాటులో ఉండేలా హార్బర్ పోలీస్ స్టేషన్ కు స్ధలం కేటాయించారు. ఈ సందర్భంగా కృష్ణబాబు మాట్లాడుతూ హార్బర్ పోలీస్ స్టేషన్ నిర్మాణం కోసం 1 కోటి 16 లక్షల రూపాయలు వెచ్చిస్తున్నట్లు వెల్లడించారు. అన్ని సదుపాయాలతో మోడల్ స్టేషన్ గా నిర్మించనున్నట్లు తెలిపారు. రామకృష్ణ జంక్షన్ ఐతే అందరికి అందుబాటులో ఉంటుందని ఇక్కడ స్ధలాన్ని ఎంపిక చేసినట్లు కృష్ణబాబు వెల్లడించారు. ఏడాది కాలంలో స్టేషన్ నిర్మాణ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ 2 రవికుమార్ మూర్తి, ఎసిపి రంగరాజు తో పాటు పోర్టు విభాగాధిపతులు, ఉద్యోగులు పాల్గొన్నారు.