రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్నారు ఏపీ సీఎం.. టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రాంతీయ పార్టీల్లో సమర్థవంతమైన నాయకత్వం ఉందన్నారు. బీజేపీని విభేదిస్తే ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారన్నారు చంద్రబాబు. ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందన్నారు. ఈవీఎంలపై జనాలకు అవగాహన అవసరమన్నారు బాబు. విజయవాడలో జరుగుతున్న మహానాడులో.. కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారాయన.