TDP Mahanadu CM Chandrababu Naidu speech at | Vijayawada,Vizag Vision..బీజేపీ కుట్రలో భాగంగానే తిరుపతి వెంకన్న ఆభరణాలపై దుష్ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ మహానాడులో ప్రసంగిస్తూ టీటీడీని పురావస్తుశాఖ ఆధీనంలోకి తీసుకొచ్చేందుకు కుట్ర చేశారని, టీటీడీని మోదీ కబ్జా చేయాలని చూశారని ఆరోపించారు. వెంకన్న జోలికి వస్తే ఈ జన్మలోనే శిక్ష అనుభవిస్తారని హెచ్చరించారు. వెంకన్న స్వామితో పెట్టుకున్నవారు ఎవరూ బాగుపడలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
బీజేపీ నమ్మకద్రోహం చేసిందని..విభజన హామీలు అమలుచేయలేదని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదా డిమాండ్‌కు తెలంగాణ కూడా మద్దతు ఇచ్చిందన్నారు. ఎవరికీ ఇవ్వబోమని చెప్పి 11 రాష్ట్రాలకు హోదా పొడిగించారని… ఏపీపై ఎందుకు వివక్ష చూపుతున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా, ఇచ్చిన హామీలు అమలుచేయాల్సిందే అని డిమాండ్ చేశారు. బీజేపీని వదిలిపెట్టేది లేదని..హక్కులు సాధించుకుంటామని బాబు స్పష్టం చేశారు. ఏపీకి జరిగిన అన్యాయంపై ధర్మపోరాటం చేస్తున్నామని తెలిపారు.
రాయలసీమ డిక్లరేషన్ పేరుతో చిచ్చు పెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చిన డబ్బును కూడా వెనక్కి తీసుకున్నారన్నారు. బుందేల్‌ఖండ్ ప్యాకేజి ఇస్తామని ఎందుకు ఇవ్వలేదని కేంద్రాన్ని నిలదీశారు. కేంద్రం సుపరిపాలన అందించినా ఏపీకి కేంద్రం సహకరించి ఉంటే ఇంకా మెరుగైన ఫలితాలు వచ్చేవని చంద్రబాబు అన్నారు.