AP CM Chandrababu Hold Meeting with Collectors at Amaravathi,Vizagvision..అగ్రపధం-ఆనందం’ మన లక్ష్యం
జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి నిర్దేశం…ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో నెంబర్‌వన్ రాష్ట్రంగా నిలిపేలా, రాష్ట్రంలో అందరినీ ఆనందంగా వుంచేలా మనపై గురుతర బాధ్యత వుందని జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు…..ఇందుకు మనలో సాధించాలనే తపన, నిరంతర శ్రమ అవసరమని అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే మన బాధ్యతని, విజన్‌ను ఎప్పటికప్పుడు కాలానుగుణంగా మార్పు చేసుకోవాలని జిల్లా కలెక్టర్లను, అధికారులను నిర్దేశించారు. స్థూలంగా చూస్తే మనమంతా బాగా పనిచేసినా, సూక్ష్మ స్థాయిలో మన పనితీరు ఇంకా మెరుగుపరచుకోవాల్సి వుందని ముఖ్యమంత్రి చెప్పారు…….ఈ విషయంలో రెండు రోజుల కలెక్టర్ల సమావేశం మనకు మరింత స్పష్టత తెస్తుందని ఆశిస్తున్నామన్నారు.
మంగళవారం ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాల్లో జరిగిన జిల్లా కలెక్టర్ల 16వ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు…….మన సాధించిన పథకాలు, అవార్డులు మనకు స్ఫూర్తిని ఇస్తుంటాయని చెప్పారు. ఈ నాలుగు సంవత్సరాలు కష్టపడి, దేశంలో ఎక్కడా జరగని అభివృధ్ది ఏపీలో జరిగేలా కృషి చేసిన ఉద్యోగులు, అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అన్నారు……ప్రతి మూడు నెలలకు ఒకసారి కలెక్టర్ల సమావేశం నిర్వహించుకుంటున్నామని పేర్కొన్న ముఖ్యమంత్రి, ఫలితాలు ఏవిధంగా వున్నాయో సమీక్షించుకుని, వాటి ఆధారంగా పాలన సాగిస్తున్నామని చెప్పారు……జూన్ 2కు నవ్యాంధ్రప్రదేశ్‌లో పాలనకు నాలుగేళ్లు నిండుతున్నాయని, ఆరోజు నవనిర్మాణ దీక్షను అందరిలో స్ఫూర్తి కలిగించేలా నిర్వహిస్తున్నట్టు తెలిపారు…..సంక్షేమంపై నిర్లక్ష్యం వద్దు
‘సంక్షేమం, అభివృద్ధి రెండింటి మీద సమాన దృష్టి పెట్టాం. సంక్షేమ కార్యక్రమాల్లో ఎక్కడా నిర్లక్ష్యం వుండకూడదు, ప్రజా సంతృప్తి ప్రధానం……
ఉన్న చోటు నుంచే సాంకేతికతను వినియోగించుకోవడం ద్వారా తమ సమస్యలు పరిష్కరించుకునేలా చర్యలు తీసుకున్నాం…..
ఎప్పటికప్పుడు ప్రజా సంతృప్తిని ప్రాతిపాదికగా తీసుకుంటున్నాం, ప్రపంచంలో ఎక్కడా ఇటువంటి అభ్యాసం జరగడం లేదు. మన రాష్ట్రంలో అందరి అభిప్రాయాన్ని అన్ని విషయాల్లోనూ తీసుకుంటున్నాం……ఎవరు లబ్ది పొందుతున్నారో వారి దగ్గర సమాచారం తీసుకుని సంతృప్థి స్ధాయిని అంచనా వేస్తున్నాం.’ అని ముఖ్యమంత్రి చెప్పారు…..
సంక్షేమానికి రూ. వేల కోట్లు
‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. సంక్షేమ పథకాల అమలు ఒక్కటే పేదరిక నిర్మూలనకు పరిష్కారం కాదు……
స్థిరమైన ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలి. ప్రజారోగ్యంపై భారీగా నిధులు ఖర్చు చేయడం ద్వారా పేదలు అప్పులపాలు కాకుండా చూడగలం.’ అని ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లకు సూచించారు…..
త్వరలో 5 లక్షల మందికి పింఛన్లు
రాష్ట్రంలో 47 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని, రానున్న రోజుల్లో అర్హత కలిగిన మరో 5 లక్షల మందికి పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి చెప్పారు…..
అలాగే కేంద్ర ప్రభుత్వం చక్కెర నిలిపేసినా పేదవారికి చక్కెర అర కిలో ఇస్తున్నామని, పేదల్లో పోషకాహార లోపం లేకుండా కందిపప్పు ఇస్తున్నామని అన్నారు…..
కుటుంబ సభ్యుల మరణం కారణంగా అభద్రతతో ఏ కుటుంబం కుప్పకూలిపోకుండా ‘చంద్రన్న బీమా’ కింద రూ. 5 లక్షలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ……
‘చంద్రన్న బీమా’ కింద పరిహారాన్ని సకాలంలో ఇవ్వడంతో ప్రజల్లో సంతృప్తి అత్యధికంగా వుందన్నారు. మనం పనిచేస్తే ప్రజలు ఏ విధంగా అభినందిస్తారో ఇదే ఉదాహరణగా చెప్పారు……
అవకతవకలకు ఆస్కారం లేకుండా ‘చంద్రన్న పెళ్లికానుక’ను లబ్దిదారుల ఖాతాకు నేరుగా వేస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 75 యూనిట్లు వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నామని, నరేగా కింద 100 రోజులు ఉపాధి హామీ కల్పిస్తున్నామని అన్నారు…
వచ్చే నెల నుంచి నిరుద్యోగ భృతి, అన్న కేంటిన్లు
యువతకు ‘నిరుద్యోగ భృతి’ వచ్చే నెల నుంచి ప్రారంభించాలని అనుకుంటున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ….
అలాగే వచ్చే నెల 2 నుంచి కొత్తగా ‘అన్న కేంటిన్లు’ ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఈ సంవత్సరం పోషకాహార లోపం అనేది లేకుండా చేయాలని సంకల్పించామని అన్నారు…
విద్యుత్ చార్జీలు పెంచకపోవడం మన విజయం
విద్యుత్ కొరతను అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో అధిగమించామని, ఇప్పుడు మిగులు సాధించామని తెలిపిన ముఖ్యమంత్రి విద్యుత్ చార్జీలు పెంచమని ధైర్యంగా చెప్పామని, వంద శాతం విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామని చెప్పారు…..
మనకన్నా ఎక్కువ వనరులు వున్న రాష్ట్రాలు కూడా మనలాగా వంద శాతం గ్యాస్, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వలేకపోయాయని పేర్కొన్నారు.
ఈ ఏడాదిలోగా కోటి ఫైబర్ గ్రిడ్ కనెక్షన్లు
ఈ ఏడాదిలోగా కోటి ఫైబర్ గ్రిడ్ కనెక్షన్లు ఇస్తామని, నాలుగేళ్లలో 16 వేల కి.మీ. మేర సీసీ రోడ్లు వేశామని, మరో 3 వేల కి.మీ వరకు సీసీ రోడ్లు వేసేందుకు అవకాశం వుందని ముఖ్యమంత్రి అన్నారు…..