YSRCP Vanchana Vyatireka Deeksha,Visakhapatnam,Vizagvision..పరిపాలన చేతకాని దద్దమ్మ ప్రభుత్వం రాష్ట్రంలో నడుస్తోంది.ప్రధానిమంత్రి నరేంద్రమోది మట్టి,నీళ్లు ఇస్తే జగన్ మోహన్ రెడ్డి ఏమి మాట్లాడలేదని దద్దమ్మ మంత్రి దేవినేని ఉమ అంటారు.జగన్ మోహన్ రెడ్డి నరేంద్రమోదిని ఎలా అవిశ్వాసం ధ్వారా ఢికొన్నారో ప్రజలందరికి తెలుసు.అసలు ఆ మట్టి,నీళ్లు అందుకున్న చేతగాని అసమర్ద ముఖ్యమంత్రి చంద్రబాబు వాటిని ఎలా అందుకున్నారో సమాధానం చెప్పాలి.దద్దమ్మలా మాట్లాడటం కాదు అని దేవినేని ఉమని నిలదీశారు.ప్రజలందరిని వంచనకు గురిచేసిన చంద్రబాబును ప్రజలు తరిమికొడతారు.ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులతో రాజీనామాలు చేయించి నరేంద్రమోదిపై నిరసన తెలియచేసారు.అదే చంద్రబాబు తన ఎంపిలతో రాజీనామాలు చేయించకుండా లాబీయింగ్ చేసుకునేందుకు ఉంచారు.వారు రాజీనామాలు చేసేవరకు గ్రామాలకు రానీయకుండా తరిమితరిమి కొట్టాలని పిలుపుఇచ్చారు.